*కమ్మ అనేది ఒక పురాతన కమ్యూనిటీ, కమ్మ వారు ప్రాచీన కాలము నుండి విశ్వమానవ సౌబ్రాతృత్వమునే పరమావధిగా, వసుదైక కుటుంబముగా భావించి, నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము, దయాదాక్షిణ్యము, శాంతము, సహనమును నమ్మి ఆచరించిరి, ఆచరించుచుండిరి. ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము అనే నినాదం ప్రతీకలుగా బ్రతికిరి, బ్రతుకుచుండిరి. అట్టి మహనీయుల మహోన్నతుల సాంఘిక, సంస్కృతిక, సాహిత్యం, బాషా, యాస, విద్య, ఇళ్ల పేర్లు, వాడుక గోత్రములు తెలుసుకొనుట, తరువాత తరాలకి కూడా అందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని మరియు నిన్నునీవు తెలుసుకొనుటకు, చక్కదిద్దుకోవడానికి కరదీపికగా ఇది ఉపయోగపడుతుందనే మంచి ఆశయముతో ప్రారంభించబడినది.
కమ్మ వారు కొన్నిదశాబ్దాలు నుంచి ఉత్తర అమెరికాకి ఉన్నత చదువుల కోసం, వైద్యవిధ్య, సైన్స్ & టెక్నాలజీ, ఉద్యోగం, వ్యాపారరీత్యానే కాకుండా చలనచిత్రం చిత్రీకరించుటకు అమెరికాలో స్థిరపడటం జరుగుతుంది. అమెరికాలో ఉంటున్న కొన్ని లక్షలమంది కమ్మ వారికీ క్రితం సంవత్సరం అనగా 2022 వరకు ఎటువంటి కమ్మ సంఘము లేదు అనడంలో అతిశయోక్తి లేదు. మొట్ట మొదటిసారిగా ఉత్తర అమెరికాలో ఉంటున్న అమరావతి మరియు తెలంగాణ రాష్ట్రాల కమ్మ వారే కాకుండా తమిళనాడు, కర్ణాటక మరియు భారతదేశంలోని మన కమ్మవారిని అందిరిని ఒక చోటకి చేర్చాలని ఉద్దేశంతో ఒక్క వేదికగా "ఉత్తర అమెరికా కమ్మ సంగం" 501(c)3 ప్రకారం ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థని స్థాపించటం జరిగినది.
చరిత్ర:-
కమ్మవారు ప్రధానంగా విజయనగర, కాకతీయ, గండికోట సామ్రాజ్యం కాలంలో చారిత్రకంగా మహారాజులుగా, సామంతరాజులుగా, సైన్యాధ్యక్షులుగా, పరిపాలకులుగా, పాలన, రచయితలుగా, వ్యవసాయం వృత్తుల్లో పలు హోదాల్లో పనిచేశారు. 20వ శతాబ్ది తొలినాళ్ళకు కమ్మవారు ప్రధానంగా కమ్మ బ్రాహ్మణులు, వ్యవసాయదారులుగా ఉండేవారు. వీరు ప్రత్యేకించి వ్యవసాయ వృత్తిలో మంచి పేరు సంపాదించుకున్నారు. 20వ శతాబ్ది మలిభాగం నుంచి వివిధ వృత్తుల్లోకి ప్రవేశించి, విజయం సాధించడం పెరిగింది. చలనచిత్రరంగం, ఆతిథ్యం, వైద్యవిద్య, రచయితలుగా, పత్రిక సంపాదకులు అనగా మీడియా, క్రీడలు, శాస్త్రివేత్త, సాంకేతిక వంటి అనేక రంగాల్లో కమ్మవారు ప్రవేశించి వ్యక్తులుగానూ, సంస్థలకు అధిపతులుగానూ స్థిరపడ్డారు. ఇప్పటికి గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ కేంద్ర మంత్రులుగా, శాసనసభ్యులుగా, ఇతర రంగాలలో పురుషులతో పాటు మహిళలకి కూడా సమాన హక్కులు కలిగియుండిరి.